టెక్ ప్రపంచంలో సెక్స్ స్కాండల్స్ – రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అనేకమంది సీఈఓలు!

Nvidia CEO Out
  • ఎన్విడియా బాసుపై వేటుతో కార్పొరేట్ ఉలికిపాటు
  • రాసలీలలు, విచ్చలవిడితనంపై కంపెనీల ఉక్కుపాదం!
  • నైతికత తప్పినందుకు సంచలన వేటుతో గెంటివేత
  • ఎన్విడియా నుంచి ఇంటెల్ దాకా ఉద్వాసనల పర్వం
  • కార్పొరేట్ రంగంలో నైతిక విలువలే అసలైన కొలమానం!

సహనం వందే, హైదరాబాద్:

కార్పొరేట్ రంగం అంటే అపరిమితమైన స్వేచ్ఛ, భారీ వేతనాలు, విలాసవంతమైన జీవనశైలి అని చాలా మంది భావిస్తుంటారు. అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండొచ్చని, వ్యక్తిగత జీవితంలో ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటారు. కానీ, ఆ రంగుల ప్రపంచం వెనుక అత్యంత కఠినమైన నియమ నిబంధనలు, ఉక్కు లాంటి క్రమశిక్షణ ఉంటాయి. స్వేచ్ఛను విచ్చలవిడితనంగా మార్చుకుని, కంపెనీ రూల్స్ బ్రేక్ చేసిన ఎంతటి దిగ్గజాలకైనా ఆ కుర్చీలో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత ఉండదు. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా వ్యక్తిగత ప్రవర్తన సరిగ్గా లేకపోతే కార్పొరేట్ బోర్డులు ఎంతమాత్రం సహించవని చరిత్ర అనేకసార్లు నిరూపించింది.

ఎన్విడియా తాజా ఉదంతం
ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓగా అసాధారణ విజయాలు సాధించిన జెన్సెన్ హువాంగ్… వ్యక్తిగత ప్రవర్తన, వివాహేతర సంబంధాల కారణంగా ఒక్కసారిగా కుర్చీ కోల్పోవాల్సి వచ్చింది. కేవలం వ్యక్తిగత అఫైర్ మాత్రమే కాకుండా, అందులో ఒక మహిళ చైనా గూఢచారిగాఅ అనుమానించటం దేశ భద్రతను తాకే తీవ్రమైన అంశంగా మారింది. కంపెనీ రహస్యాలు, టెక్నాలజీ డేటా పరాయి దేశాల చేతికి చిరిగే ప్రమాదం ఉందనే భావనతో బోర్డు ఎలాంటి ముందస్తు మినహాయింపులు ఇవ్వకుండా తక్షణ చర్య తీసుకుంది. ఇక ఆహార ఉత్పత్తుల రంగాన్ని శాసించే ప్రపంచ దిగ్గజం నెస్లే మాజీ సీఈఓ మార్క్ ష్నైడర్ హయాంలో నైతిక ప్రమాణాలు సడలిపోతున్నాయనే సంకేతాలు రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Nvidia Share Market Downfall

ఇంటెల్, మెక్‌డొనాల్డ్స్ సీఈఓల తప్పులు
టెక్నాలజీ రంగానికి మరో ఉదాహరణ ఇంటెల్ మాజీ సీఈఓ బ్రయాన్ కర్జానిచ్, తన కింద పనిచేస్తున్న ఉద్యోగితో రహస్యంగా సంబంధం కొనసాగించినట్లు నిరూపితమైంది. కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల ప్రకారం ఉన్నత అధికారులకు కింది స్థాయి ఉద్యోగులతో ఇలాంటి సంబంధాలు ఉండకూడదు. ఇది అధికార దుర్వినియోగానికి, పక్షపాతానికి దారితీస్తుందనే కఠినమైన నిబంధన ఉండటంతో, రూల్ బ్రేక్ చేసినందుకు బోర్డు ఆయనను తక్షణమే సాగనంపింది. ఫాస్ట్ ఫుడ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న మెక్‌డొనాల్డ్స్ మాజీ సీఈఓ స్టీవ్ ఈస్టర్ బ్రూక్ కూడా తన కంపెనీ ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో మెక్‌డొనాల్డ్స్ బోర్డు తీవ్రంగా స్పందించింది. కంపెనీ ప్రతిష్టను, నైతిక విలువలను దిగజార్చే ఏ చర్యను క్షమించేది లేదని తేల్చిచెప్పింది.

కఠిన నిర్ణయాల వెనుక బలమైన కారణాలు
కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీ కేవలం ఉత్పత్తులను అమ్మే వ్యాపారం మాత్రమే కాదు, కోట్లాది మంది ఇన్వెస్టర్ల నమ్మకం, లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో షేర్లు నిలబడాలన్నా, ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టాలన్నా సంస్థపై నమ్మకం చాలా ముఖ్యం. సీఈఓ చేసే చిన్న నైతిక తప్పిదం కూడా బ్రాండ్ వాల్యూను క్షణాల్లో సున్నా చేసేస్తుంది. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం ఉంటుందనేది అపో మాత్రమేనని, లోపలికి వెళితే ప్రతి క్షణం నిఘా, కఠినమైన ఆడిటింగ్, ప్రవర్తనా నియమావళి ఉంటాయని తెలుస్తుంది. ఒక వ్యక్తి అనైతిక ప్రవర్తన వల్ల వచ్చే జరిమానాలు, న్యాయపరమైన చిక్కులు కంపెనీ మనుగడనే దెబ్బతీస్తాయి. కాబట్టి బోర్డులు మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకుంటాయి.

నైతికతే కంపెనీకి అసలైన లైఫ్‌లైన్
నైతికత అనేది కేవలం నిబంధన కాదు, అది కంపెనీకి లైఫ్‌లైన్ లాంటిది. ఎన్విడియా అయినా, నెస్లే అయినా, ఇంటెల్ అయినా ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నాయంటే కారణం వారికున్న కఠినమైన క్రమశిక్షణే. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ తప్పుతుందో, లంచాలు, గూఢచర్యం తెరపైకి వస్తాయో అప్పుడు సామ్రాజ్యాలు కుప్పకూలడం ఖాయం. భవిష్యత్ తరాలకు, యువ వ్యాపారవేత్తలకు ఈ ఘటనలన్నీ పాఠం. ఎంత ఎత్తుకు ఎదిగినా నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తే నేలకూలక తప్పదనే స్పష్టమైన పాఠం నేర్పుతున్నాయి. చట్టం ముందు, కార్పొరేట్ నియమాల ముందు ఎవరూ అతీతులు కాదనే సత్యాన్ని ఈ ఉదంతాలు బలంగా చాటుతున్నాయి. అంతిమంగా కార్పొరేట్ రంగం నిజాయితీకి, పారదర్శకతకు మాత్రమే పెద్దపీట వేస్తుంది కాబట్టి, నైతికత అనేది కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీ.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *