డాక్టర్ల చేతిలో గరిటె – వైద్యుడి చేతి వంట… కిచెనే కొత్త క్లినిక్
సహనం వందే, హైదరాబాద్: వైద్యం అంటే కేవలం రోగి నాడి పట్టుకోవడం కాదు.. వంటగదిలో గరిటె పట్టుకోవడం కూడా. మనం తినే ప్రతి ముద్ద మనల్ని బతికించాలి కానీ చావుకు దగ్గర చేయకూడదు. అందుకే ఇప్పుడు అమెరికాలోని డాక్టర్లు మెడిసిన్ పుస్తకాలను పక్కన పెట్టి వంట గిన్నె పట్టుకుంటున్నారు. రోగానికి మందు బిళ్లలు ఇవ్వడం కంటే రోగం రాకుండా వంట చేయడం నేర్పడమే గొప్ప వైద్యమని వారు నమ్ముతున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కిచెన్‌కు…లారెన్ ఎస్టెస్ అనే…