అనారోగ్య దళితుడిపై అగ్రకుల దమనకాండ – ఆలయం పరిసరాల్లో మూత్రం పోశాడని ఫైర్
సహనం వందే, లక్నో:లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్... దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను…