
ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక
సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…