నర్మెట్ట వెనుక త్రిబుల్ ‘ఎస్’ల కుట్ర – సురేందర్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డీల స్కెచ్

సహనం వందే, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. దాని వల్ల ఆ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? లేక ఆయిల్ ఫెడ్ కేవలం రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టటానికి ఇదంతా చేస్తుందా?…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…

Read More