ఐదేళ్ల నరమేధం… వీడని భయం – వరంగల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ వ్యవహారం
సహనం వందే, వరంగల్: ఐదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను వణికించిన గొర్రెకుంట సీరియల్ కిల్లర్ వ్యవహారం ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక అక్రమ సంబంధంతో మొదలైన ఈ దారుణం పది మంది హత్యకు దారితీసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 2020 మే నెలలో జరిగిన ఈ సామూహిక హత్యల ఘటన నేరం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించింది. పోలీసుల చర్యలతో నేరస్తుడికి ఉరిశిక్ష పడినా ఆ…