నైట్ డ్యూటీ… డబుల్ శాలరీ – ఉత్తరప్రదేశ్ మహిళలకు ప్రత్యేక సౌకర్యం
సహనం వందే, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఇకపై మహిళలు కూడా రాత్రి వేళల్లో పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం… మహిళలు ఇక నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ వెసులుబాటు ప్రమాదకరమైన పరిశ్రమల్లోని 29 రకాల పనులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయంలో మహిళల అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం…