రాహుల్ గాంధీ… హామీ ఏమైంది? – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదేంటి?
సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల గళం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్న ధోరణిపై బీసీ మేధావులు కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినా ఆశించిన మార్పు రాకపోవడంపై అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ బీసీలకు మాత్రం…