తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు?

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు అనగాని, పార్థసారథి, నారాయణతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో కదిలిక వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ…

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి – టీడబ్ల్యూజేఎఫ్

కొత్త స్పెషల్ కమిషనర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార్ భవన్‌లో కొత్త స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సిహెచ్. ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి అభినందించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యతో పాటు ఇతర ప్రతినిధులు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడిటేషన్లు,…

Read More

సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావం

సహనం వందే, హైదరాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రతినిధులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ తీవ్రంగా ఆరోపిస్తోంది. సాక్షి మీడియా వర్గాల ప్రకారం… పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపకుండానే…

Read More