పంట పొలాల్లో రక్తపుటేరులు – అప్పులు.. నష్టాలతో రైతు ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ:2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని…

Read More

రైతు బలి… రఘునందన్ బదిలీ – రుణమాఫీ… యూరియా కొరత ఎఫెక్ట్

సహనం వందే, హైదరాబాద్:సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగించి బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎక్కువకాలం వ్యవసాయశాఖలో ఉన్నందున బదిలీ చేశారని కొందరు అంటుంటే… కీలకమైన పంటల సీజన్లో అకస్మాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అంటున్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన రెండు ప్రధాన వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ అమలులో గందరగోళం…కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… ముఖ్యమంత్రి…

Read More

భూమి కోసం బెజవాడ గర్జన – అన్నదాత ఆగ్రహం… ప్రభుత్వ దౌర్జన్యం

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని నిరసిస్తూ బెజవాడ వీధుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాలు పోటెత్తాయి. తమ జీవనాధారాన్ని బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఒక్కతాటిపైకి వచ్చి నినదించారు. భూమిని అమ్మేవారుగా కాకుండా, భూమిని నమ్ముకున్న రైతులుగా తమ హక్కును నిలబెట్టుకోవడానికి ఈ గర్జన ప్రారంభమైంది. ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో మార్మోగిన నినాదాలు, రాష్ట్రంలో నెలకొన్న…

Read More

‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

Read More