కేసీఆర్ దోషి… హరీష్ పాత్రధారి – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి

సహనం వందే, హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. అనంతరం రేవంత్ రెడ్డి…

Read More

ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

యూరియా గండం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే…

Read More