అప్పలనాయుడికి ‘చంద్ర’హారం – కలిశెట్టి సూపర్… చంద్రబాబు సర్టిఫికెట్

సహనం వందే, విజయనగరం:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. దత్తి గ్రామంలో బుధవారం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎంపీ అప్పలనాయుడు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను శక్తివంతంగా నిర్వహిస్తూ తెలుగుదేశంను ప్రాణంగా చూసుకుంటున్నారని సభా వేదికగా ప్రశంసించారు. ఈ కామెంట్లతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. సేవ…

Read More

అప్పలనాయుడు… గిరిజన గుండెచప్పుడు – ఏజెన్సీలో విజయనగరం ఎంపీ పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గిరిజనుల మనసు గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో గిరిజన పల్లెల్లో రాత్రి బస చేశారు. తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీగా చరిత్రకెక్కారు. ఆయన కేవలం రాత్రి గడపడం మాత్రమే కాదు, పల్లెనిద్ర తర్వాత పొద్దున్నే లుంగీ కట్టుకుని పొలాల గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన సాధారణ జీవనశైలి గిరిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పలనాయుడు… మాస్ లీడర్రాజకీయ హోదా, అధికారిక…

Read More

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపీ కలిశెట్టి అభినందన

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వారు రాధాకృష్ణన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకం మాత్రమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తమ మద్దతును తెలియజేసేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు…

Read More

నాడు సుందరయ్య… నేడు అప్పలనాయుడు – సైకిల్ పై పార్లమెంటుకు ఎంపీ

సహనం వందే, ఢిల్లీ:కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది….

Read More