అవినీతి ఉద్యోగులతో జైళ్లు కిటకిట! – కటకటాల్లో 60 మంది.. ఉన్నతాధికారులూ అదే దారి!
సహనం వందే, హైదరాబాద్: ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపుతుండటంతో తెలంగాణ జైళ్లు నిండిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 మంది ఉద్యోగులు రిమాండ్లో ఉండగా, అందులో చంచల్గూడ జైలులోనే 35 మంది ఉన్నారు. కింది స్థాయి సిబ్బందే కాకుండా కీలక ఉన్నతాధికారులు కూడా కటకటాలపాలవడం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపుతోంది. ఒకవైపు ఏసీబీ వరుస అరెస్టులు చేస్తుంటే, మరోవైపు గతంలో నమోదైన కేసులే మూసివేత దిశగా వెళ్లడం కొత్త…