
ఆయిల్ ఫెడ్ తిరుమలేశునికి దెబ్బ మీద దెబ్బ
సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి పెత్తనానికి కత్తెరలు పడుతున్నాయి. ఆయన అధికారాలను ఒక్కొక్కటి తగ్గించే కార్యక్రమానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు విభాగాలను తన చేతుల్లో ఉంచుకొని ఆడించిన నాటకానికి తెరపడుతుంది. ‘నేను ఏం చేస్తే అదే చెల్లుబాటు’ అన్న ఆయన ధోరణికి చెక్ పడుతుంది. మొన్నటి వరకు ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ తన చేతిలో ఉంచుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై…