Narahari

తెలంగాణ వైద్య విధాన పరి’చిత్తు’ – సకాలంలో జీతాలు అందక వైద్యుల అవస్థలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మండిపడింది. నెలల తరబడి జీతాలు అందకపోవడం… హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం… అనేక జిల్లాల్లో డిప్యూటీ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) పోస్టులు ఖాళీగా ఉండటం వంటి అంశాలు పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల కార్యకలాపాలను, వైద్య సిబ్బంది మనోబలాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. పరిపాలన స్తంభించడంతో రోజూవారీ పనులు నిలిచిపోయి ప్రజలకు వైద్య సేవలు…

Read More
Dr.Narahari TGGDA President raise voice on Allowances

అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ…

Read More