
పంట పొలాల్లో రక్తపుటేరులు – అప్పులు.. నష్టాలతో రైతు ఆత్మహత్యలు
సహనం వందే, న్యూఢిల్లీ:2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని…