భరించలేం… బతకలేం – కొండపై నుంచి దూకిన 9వ తరగతి బాలికలు
సహనం వందే, కేరళ:కేరళలో మారుతిమల కొండపై జరిగిన దారుణం అందరి హృదయాలను పిండేస్తుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు మనసు కకావికలమై వెయ్యి అడుగుల ఎత్తున్న కొండపై నుంచి దూకగా ఒక అమ్మాయి చనిపోయింది. ఒక బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్నేహం, చదువు, కలలతో కళకళలాడాల్సిన ఆ చిన్న హృదయాలను ఆత్మహత్యకు పురిగొల్పేంతటి క్రూరమైన ఒత్తిడి, ఆవేదనను ఎవరు కలిగించారు? వారి మౌనం వెనుక దాగిన బాధే ఈ విషాదానికి…