‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

Read More

ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది….

Read More