హుస్సేన్‌సాగర్ నీటిపై క్రికెట్ స్టేడియం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరిన్ని కొత్త హంగులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్‌ నీటిపై ఫ్లోటింగ్ గ్రౌండ్స్ (తేలియాడే మైదానాలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసులు నీటిపైనే ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి సింగపూర్ వంటి విదేశాల్లోనే…

Read More

కోచింగ్‌కు పన్ను… భవిష్యత్తుపై మన్ను – విద్యార్థుల జీవితాలతో 18% జీఎస్టీ ఆట

సహనం వందే, హైదరాబాద్:మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడొక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, మరోవైపు పెరిగిపోయిన ఖర్చులు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్లకు, ఆన్‌లైన్ ట్యూషన్లకు 18 శాతం జీఎస్టీ విధించడంతో ఈ సంకట పరిస్థితి మరింత పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు పన్ను పరిధి నుంచి మినహాయించిన ప్రభుత్వం… కోచింగ్ సంస్థలను విద్యాసంస్థలుగా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను భారం వల్ల తల్లిదండ్రులు కోచింగ్ మానిపించి, పిల్లలను మళ్లీ పాఠశాల విద్యపై…

Read More

అల్లు అర్జున్ కు మరో షాక్ – అల్లు బిజినెస్ పార్క్‌ పై జీహెచ్ఎంసీ కన్నెర్ర

సహనం వందే, హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా…

Read More