వారసుడిదే పీఠం… ఆడబిడ్డ శోకం – రాజకీయ మంటల్లో ఆడకూతురు ఆగమాగం
సహనం వందే, హైదరాబాద్:రాజకీయ చదరంగంలో ఎప్పుడూ బలిపశువులు అయ్యేది ఆడబిడ్డ అనే చేదు నిజం మరోసారి బయటపడింది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయడమే కాదు అక్కడి అతిపెద్ద రాజకీయ కుటుంబమైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కూడా చిచ్చు రేపాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తే… ఆ ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి…