
తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుమతికి 500 కోట్లు?
సహనం వందే, హైదరాబాద్:ప్రైవేటు మెడికల్ కాలేజీల మాఫియా వైద్య విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. డబ్బా కాలేజీలు పెట్టి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), వైద్య…