‘ఐఐటీ’యన్ కోసం కదిలొచ్చిన గూగుల్ – గంటలో పాస్ పోర్ట్.. ప్రైవేట్ జెట్లో అమెరికాకు
సహనం వందే, పాట్నా:సాధారణంగా విద్యార్థులు ఇంటర్నెట్‌లో కాలక్షేపం చేస్తారు. కానీ బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ఇందుకు భిన్నం. ఐఐటీ మణిపూర్‌లో చదువుతున్న ఈ యువకుడు… ఏకంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ పైనే దృష్టి పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే! తన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 53 సెకన్ల పాటు గూగుల్‌ను స్తంభింపజేసి… ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎక్కడికక్కడ కూర్చున్న గూగుల్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా ఈ అనూహ్యమైన హ్యాక్‌కు కారణం…