
నాడు సుందరయ్య… నేడు అప్పలనాయుడు – సైకిల్ పై పార్లమెంటుకు ఎంపీ
సహనం వందే, ఢిల్లీ:కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది….