
జెన్ జెడ్ వెనుక ‘డీజే’ సౌండ్ – నేపాల్ ను కుదిపేసిన నేత సుదాన్ గురుంగ్
సహనం వందే, నేపాల్:నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది…