
రద్దయినా మారని బుద్ధి – ‘మహావీర్’ యాజమాన్యం ధిక్కరణ ధోరణి
సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని ‘మహావీర్’ మెడికల్ కాలేజీ బాగోతం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు లేవని ఆ సంవత్సరం బ్యాచ్ లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడు కాలేజీల్లో మహావీర్ మెడికల్ కాలేజీ కూడా ఉంది. అయినప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని బోధనాసుపత్రిని చూస్తే అర్థమవుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండన్న…