
బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…