‘బాబు’ గోత్రం… కలిశెట్టి మేనల్లుడి కంఠస్థం
సహనం వందే, రణస్థలం:కలిశెట్టి అప్పలనాయుడు… విజయనగరం ఎంపీ. ఆయన స్టైలే వేరు. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి చేదోడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా చంద్రబాబుకు ప్రియ శిష్యుడుగా ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఏ దేవాలయంలో అర్చనలు చేసినప్పటికీ తమ కుటుంబ సభ్యుల గోత్రనామాల కంటే…