కొత్త ఇంట్లో రోగాల కుంపటి – అడుగుపెట్టిన రోజు నుంచి జబ్బుల జాతర

సహనం వందే, అమెరికా:ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. అమెరికాలోని ఓహియోకు చెందిన సారా, కోలిన్ దంపతులు కూడా అదే కలను సాకారం చేసుకున్నారు. 2024 మే నెలలో సుమారు రూ. 3.3 కోట్లు వెచ్చించి ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులు సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే సారాకు వింత ఆరోగ్య సమస్యలు…

Read More

డబ్బుల్లో బాబు… కేసుల్లో రేవంత్ – దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్

సహనం వందే, హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలో మొదటి స్థానాల్లో ఉన్నారు. ఒకరు డబ్బుల్లో, మరొకరు కేసుల్లో ముందున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిలియనీర్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లు. అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తి కేవలం రూ. 15 లక్షలు. భారతదేశంలోని 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాలను…

Read More

రైతన్న నోట్లో మార్క్ ఫెడ్ మట్టి – పరిశ్రమలకు తరలుతున్న యూరియా

సహనం వందే, హైదరాబాద్:యూరియా కొరతతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంటలకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. కొరతను ఆసరాగా చేసుకుని కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలకు కేటాయించిన యూరియాను కొందరు అక్రమార్కులు పరిశ్రమలకు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియాను పైవుడ్, రెసిన్, పెయింట్స్, వార్నిష్ పరిశ్రమలు, జంతు, పౌల్ట్రీ, ఫీడ్ యూనిట్లలో, సారాయి తయారీలో వినియోగిస్తారు. కేంద్ర…

Read More

ఉత్తరాదికి పుత్తడి… దక్షిణాదికి ఇత్తడి

సహనం వందే, హైదరాబాద్:భారత రాజకీయాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ విభజనతో ముడిపడి ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉత్తరాదికి కీలకమైన మంత్రి పదవులు, ఆర్థిక సహాయాలు దక్కుతుండగా… దక్షిణాదికి ప్రాధాన్యం లేని పోర్ట్‌ఫోలియోలు, తక్కువ నిధులు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ… రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవితో ఒరిగేదేమీ లేదు…ఉపరాష్ట్రపతి…

Read More

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

Read More

…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ…

Read More

జడ్జి ఆదర్శం… నేతల ధిక్కారం

సహనం వందే, హైదరాబాద్: వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదర్శవంతంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు మంత్రి చెప్పారు. కానీ గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అంతంత మాత్రంగానే సేవలు ఇస్తుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More