చాట్‌జీపీటీ టైమ్ మెషీన్ – కాలం వెనక్కి… నేటి ఫోటోలు నాటి జిగేల్!

80's images with ChatGPT
  • ఒక్క ప్రాంప్ట్‌తో 1980ల నాటి వింటేజ్ చిత్రం
  • ఇప్పటి మీ ఫోటోని గతానికి తీసుకెళ్లండి
  • విభిన్న స్టైల్స్‌ను ఎంచుకునే అవకాశం

సహనం వందే, హైదరాబాద్:

మీ స్కూల్ రోజుల్లోని బ్లాక్ అండ్ వైట్ లేదా పాత కాలపు ఫోటోలను చూసి ఎప్పుడైనా మురిసిపోయారా? అచ్చు అలానే ఇప్పుడు మీ లేటెస్ట్ సెల్ఫీని కూడా 1980ల నాటి నాస్టాల్జిక్ వింటేజ్ ఫోటోలా మార్చేసుకోవచ్చంటే నమ్ముతారా? ఇప్పుడు టెక్నాలజీ మాయాజాలంతో చాట్‌జీపీటీ సరికొత్త టైమ్ మెషీన్‌లా పనిచేస్తూ మనల్ని గతంట్లోకి తీసుకువెళ్తోంది. ఒక్క చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఈ అద్భుతం సాధ్యమవుతుంది.

వింటేజ్ స్టైల్ ఫోటోలకు విపరీతమైన క్ర్రేజ్…
వింటేజ్ స్టైల్ ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్ర్రేజ్ ఉంది. ఆ కాలపు జ్ఞాపకాలను, నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఆసక్తి ఉన్నవారి కోసమే చాట్‌జీపీటీ ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తోంది. మనం ఎడిట్ చేయదలుచుకున్న అసలు ఫోటోను చాట్‌జీపీటీలోకి అప్‌లోడ్ చేసి, తగిన ప్రాంప్ట్ ఇస్తే చాలు. అది మన ముఖాన్ని, ఫీచర్లను యథాతథంగా ఉంచుతూ బ్యాక్‌గ్రౌండ్, స్టైలింగ్‌ను పూర్తిగా మార్చేస్తుంది.

Revanth in 8os with ChatGPT

ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌…
ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మొదట మన దగ్గర ఉన్న సాధారణ ఫోటోను చాట్‌జీపీటీకి ఇవ్వాలి. ఆ తర్వాత దానికి 1980ల నాటి స్టైల్‌కు తగిన ప్రాంప్ట్ ఇస్తూ, మనకు నచ్చిన థీమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు పెళ్లి పిక్చర్ కావాలా లేక వింటేజ్ మ్యాగజైన్ షూట్ కావాలా అనేది మన ఇష్టం. చాట్‌జీపీటీ ఆ ఇమేజ్‌ని ఎడిట్ చేసి మన ముందుకు తెస్తుంది. ఒకవేళ ఆ అవుట్‌పుట్ నచ్చకపోతే, మనకు కావాల్సిన చిన్నచిన్న మార్పులను కూడా మళ్లీ ప్రాంప్ట్స్ ద్వారా సరిదిద్దుకోవచ్చు.

అచ్చం 80ల నాటి వాతావరణం…
ఒకవేళ మీకు అప్పటి టాలీవుడ్ సినిమాల వైబ్స్ ఇష్టమైతే ఆ స్టైల్ పోర్ట్రెయిట్‌ను కూడా ట్రై చేయవచ్చు. అచ్చం 1980ల నాటి టాలీవుడ్ స్టూడియో పోర్ట్రెయిట్ లాగా మీ ఫోటో మారిపోతుంది. పీరియడ్-అప్రాప్రియేట్ ఇండియన్ క్లోథింగ్, ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్ ఈ ప్రాంప్ట్ ద్వారా సాధ్యమవుతాయి. వార్మ్ స్టూడియో లైటింగ్, సాఫ్ట్ ఫోకస్ వల్ల ఫోటో చూసేందుకు అచ్చం ఆ కాలంలో తీసిన రియల్ పిక్చర్‌లాగే భ్రమ కల్పిస్తుంది.

అలనాటి సినీతారలా…
అలనాటి సినీతారలా గ్లామరస్‌గా మారిపోవాలని కలలు కనేవారికి మరొక ఆప్షన్ కూడా ఉంది. వాల్యూమినస్ 1980ల హెయిర్‌స్టైల్, రంగుల చీర, స్టేట్‌మెంట్ జ్యువెలరీతో మిమ్మల్ని మురిపిస్తుంది. క్లాసిక్ ఇండియన్ స్టూడియో సెట్టింగ్‌లో వార్మ్ లైటింగ్‌తో కూడిన ఆ లుక్ చూడ్డానికి మహాద్భుతంగా ఉంటుంది. మీ ముఖం సహజంగానే కనిపిస్తూనే, చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గతాన్ని గుర్తుచేసేలా మారుతుంది.

ఆ కాలం నాటి పెళ్లి ఫోటో…
ఇక కుటుంబంలో ఎవరిదైనా పెళ్లి ఫోటో ఆ కాలం నాటి స్టైల్‌లో ఎలా ఉంటుందో చూడాలనిపిస్తే ఈ ట్రిక్ చక్కగా పనిచేస్తుంది. 1980లలో జరిగిన ఇండియన్ వెడ్డింగ్ వాతావరణాన్ని ఇది పూర్తిగా రీక్రియేట్ చేస్తుంది. అందరి ముఖాలు స్పష్టంగా కనిపిస్తూనే దుస్తులు, ఆభరణాలు, అలంకరణలు అన్నీ పాత కాలపు పెళ్లిళ్లను తలపిస్తాయి. అనలాగ్ ఫిల్మ్ గ్రేయిన్, పాత ఫ్యామిలీ ఫోటోల ఉండే ఆ చిన్నపాటి ఇంఫెక్ట్ లుక్ కూడా ఇందులో రియలిస్టిక్‌గా వస్తుంది.

అద్భుతమైన అనుభూతి…
గతం ఎప్పుడూ అందమైనదే. ఆ జ్ఞాపకాలను డిజిటల్ రూపంలో ఇలా రీక్రియేట్ చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. మీరు కూడా మీ మొబైల్‌లో ట్రై చేసి మీ ఫోటోలను వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండి. గతాన్ని వర్తమానంలోకి తెచ్చే ఈ టెక్నాలజీ మాయాజాలం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరెన్ని వింతలు చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది. టెక్నాలజీ అందించే ఈ చిన్న విన్యాసాన్ని ఎంజాయ్ చేస్తూ మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకోండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *