ప్రధాని జీతం… షాకింగ్ నిజం! – అత్యంత తక్కువ జీతం మన ప్రధానిదే

Shocking truth on Modi Salary
  • నెలకు 2 లక్షల కూడా అందుకోని మోడీ
  • సింగపూర్ ప్రధాని జీతం రూ. 2.24 కోట్లు
  • ట్రంప్ జీతం కన్నా సింగపూర్ పీఎంకే ఎక్కువ

సహనం వందే, హైదరాబాద్:

దేశాన్ని నడిపించే పెద్దలకు జీతం ఎంత ఉంటుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణ ఉద్యోగాలకైతే టార్గెట్లు, ప్రమోషన్లు ఉంటాయి కానీ, దేశ ప్రధాని అయితే వాళ్ళే బాసులు కదా, మరి వాళ్ళ జీతాలు ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆ దేశాధినేత ఎవరనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడా లేక మన దేశ ప్రధాని మోదీనా?

సింగపూర్ ప్రధానే టాప్…
మనలో చాలా మందికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడికే అత్యధిక వేతనం ఉంటుందనే అపోహ ఉంటుంది. కానీ ట్రంప్ కంటే ఎక్కువగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జీతం నాలుగు రెట్లు అధికం. నెలవారీగా అక్షరాలా 2 కోట్ల 24 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకునే ప్రభుత్వ అధినేతగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు.

సింగపూర్ ప్రధానికి ఎందుకు ఎక్కువ జీతం?
సింగపూర్ దేశం ప్రభుత్వ పెద్దలకు అంత భారీ మొత్తంలో వేతనాలు ఎందుకు ఇస్తుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. రాజకీయాల్లోకి, ప్రభుత్వ సేవలోకి అత్యుత్తమ ప్రైవేట్ రంగ ప్రతిభను ఆకర్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా నాయకులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసి, దేశంలో అవినీతిని పూర్తిగా అణచివేయడానికి ఇది ఒక బలమైన వ్యూహమని ఆ దేశం నమ్ముతుంది.

ట్రంప్ జీతం 30 లక్షలు…
ప్రపంచంలోని మిగతా అగ్రరాజ్యాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల నెలవారీ వేతనాలను పరిశీలిస్తే… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెలవారీ జీతం 29 లక్షల 33 వేల రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ నెలవారీ జీతం సుమారు 28 లక్షల 58 వేల రూపాయలు ఉండగా, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ నెలవారీ జీతం 27 లక్షల 16 వేల రూపాయలుగా ఉంది. బ్రిటన్ ప్రధాన మంత్రి నెలవారీ జీతం సుమారు 16 లక్షలు ఉంది.

మోడీ జీతమే తక్కువ…
మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందుకుంటున్న నెలవారీ జీతం వివరాలు చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ జీతం కేవలం 1 లక్షా 80 వేల రూపాయలు మాత్రమే. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, మన దేశ ప్రధాని తీసుకునే వేతనం అత్యంత సాధారణంగా ఉండటం గమనించదగ్గ విషయం. ఒక సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కంటే మన ప్రధాని జీతం తక్కువ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సింగపూర్ లాంటి దేశాలు కోట్లలో జీతాలిచ్చి అవినీతిని అరికట్టాలని చూస్తుంటే, మన దేశంలో మాత్రం సాదాసీదా జీవన శైలితోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు నాయకులు. ఇందులో ఏ విధానం సరైనదో కాలమే నిర్ణయించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *