
‘నాగరీకులెవరూ బిర్యానీని చేతితో తినరు’
సహనం వందే, న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోరాన్ మందానిపై టెక్సాస్ కాంగ్రెస్ మెన్ బ్రాండన్ గిల్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. బిర్యానీని మందాని చేతులతో తింటున్న వీడియోను రీట్వీట్ చేసిన గిల్, “అమెరికాలోని నాగరిక మానవులు ఇలా తినరు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించని వారు మూడో ప్రపంచానికి తిరిగి వెళ్ళాల’ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని రేకెత్తించాయి….