- దొంగతనాలు, రేప్, దోపిడీలు చేసేది వీళ్లే
- అన్ని రకాల దురలవాట్లు ఉండేది వీరిలోనే
- ప్రపంచంలో ప్రభుత్వ నిధులు మింగేసేది వీళ్లే
- ఆ 20 శాతం మంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు
- 84 శాతం సిగరెట్లు తాగేది 20 శాతం మందే
- అక్రమ సంబంధాలపై ఆసక్తి చూపించేదీ వీరే
- మిగిలిన 80 శాతం మంది ప్రజలు మంచివాళ్లే
- ఒక అంతర్జాతీయ సర్వే షాకింగ్ నివేదిక
సహనం వందే, హైదరాబాద్:
సమాజాన్ని వణికిస్తున్న నేర ప్రపంచం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. హత్యలు, దొంగతనాలు, మోసాలు అన్నీ చేస్తున్నది కేవలం 20 శాతం మంది మాత్రమేనని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నమ్మశక్యం కాని గణాంకాలే నేటి సమాజంలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
నేరాల ప్రపంచం
జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే నేరాలన్నింటికీ బాధ్యులుగా ఉంటున్నారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. హత్యలు, దొంగతనాలు, మోసాలు వంటి అన్ని రకాల క్రిమినల్ కన్విక్షన్స్ అన్నీ కూడా వీరి చుట్టూనే తిరుగుతుంటాయి. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసు శాఖ పడే కష్టమంతా కేవలం ఈ అతి తక్కువ శాతం మంది నేరస్థుల గురించే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళు లేకపోతే అసలు కోర్టులు, జైళ్లు, పోలీసు స్టేషన్లు అనేవే ఉండవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిగతా 80 శాతం మంది ప్రజలు ఎంతో ప్రశాంతంగా, చట్టానికి లోబడి తమ పనులు తాము చేసుకుంటూ బతుకుతుంటారు.
80/20 సూత్రం…
ఇటలీకి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త విల్ఫ్రెడో ప్యారేటో అనే ఆయన ఒక అద్భుతమైన నియమాన్ని కనుగొన్నారు. దీనినే అందరూ 80/20 సూత్రం అని పిలుస్తూ ఉంటాం. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో కేవలం 20 శాతం మంది ప్రజలు మాత్రమే ఏదైనా ఒక ప్రధానమైన మార్పుకు లేదా విషయానికి మూలకారణం అవుతుంటారు. ఉదాహరణకు మీ ఫోన్‌లోని 20 శాతం కాంటాక్ట్స్‌తోనే మీరు 80 శాతం సమయం మాట్లాడుతుంటారు. ఇదే సూత్రం మన దైనందిన జీవితంలోని అనేక అంశాలకు అద్భుతంగా సరిపోతుంది.

ప్రభుత్వ నిధులు మింగేసేది వీళ్లే
దేశంలో ఉన్న ప్రభుత్వ నిధులు, బెనిఫిట్స్ అన్నీ కూడా అందరికీ సమానంగా అందుతున్నాయా అంటే అదేమీ లేదు. దాదాపు 99 శాతం ప్రభుత్వ లబ్ది కేవలం ప్రత్యేకమైన 20 శాతం మంది చేతుల్లోకే వెళ్తుంటోంది. మిగిలిన 80 శాతం మంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం లేదని అర్థమవుతుంది. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరగడమే కాకుండా నిజంగా సాయం అవసరమైన వాళ్ళకు కొన్నిసార్లు ఆ ఫలాలు అందకుండా పోతుంటాయి. ఈ పంపిణీ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట లోపం ఉందనేది నిపుణులు నిత్యం చెబుతున్న ఒక పెద్ద నిజం.
ప్రమాదాల వేగం
రోడ్ల మీద జరిగే ప్రమాదాలు చూస్తే గుండె జారిపోతుంది. మన దేశంలో రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల సంభవించే మొత్తం గాయాలు, ఆసుపత్రిపాలయ్యే కేసుల్లో దాదాపు 78 శాతం కేసులు ఆ 20 శాతం మంది నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటి విపరీత ధోరణులే వీటికి ప్రధాన కారణం అవుతున్నాయి.
అనారోగ్య అలవాట్లు
మార్కెట్లో అమ్ముడవుతున్న కోట్ల రూపాయల సిగరెట్లలో దాదాపు 84 శాతం సిగరెట్లను కేవలం 20 శాతం మంది మనుషులే కాలుస్తున్నట్లు తేలింది. వీళ్ళు విపరీతమైన అలవాట్లకు బానిసలై రోజువారీగా విపరీతంగా పొగ తాగుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. అలాగే మార్కెట్లో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డు బకాయిలు, అప్పుల్లో దాదాపు 83 శాతం అప్పు కేవలం ఆ 20 శాతం మంది పేరు మీదనే రికార్డు అవుతోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అవసరానికి మించి ఖర్చు చేయడం, చేతిలో డబ్బు లేకపోయినా ఈఎంఐల మీద కొనుగోళ్లు చేయడం వీరికి అలవాటుగా మారిపోతుంది.
జీవన శైలి
ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగంలో కూడా ఈ లెక్కలు అచ్చంగా సరిపోతాయి. ఈ కాలంలో పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్‌ను ఎగబడి తినే వారిలో దాదాపు 67 శాతం మంది కేవలం అదే 20 శాతానికి చెందినవారు ఉంటున్నారు. వీళ్లకు ఇంట్లో చేసిన వంటల కంటే బయట దొరికే అనారోగ్యకరమైన నూనె పదార్థాలే ఎక్కువగా రుచిస్తుంటాయి. అలాగే మొత్తం మద్యంలో దాదాపు 53 శాతం ఆల్కహాల్‌ను కేవలం ఆ 20 శాతం మంది మాత్రమే తాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీళ్ళు ప్రతిరోజూ లేదా తరచూ విపరీతంగా తాగి తమ కాలేయాన్ని పూర్తిగా పాడు చేసుకుంటూ తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఒక్కరు సరిపోరు…
అలాగే సమాజంలో ఉన్న మొత్తం సెక్స్ పార్టనర్స్ లేదా రిలేషన్షిప్స్‌లో దాదాపు 47 శాతం భాగస్వామ్యాలు ఆ 20 శాతం మంది చుట్టూనే తిరుగుతుంటాయి. చాలా మంది జీవితంలో ఒక్కరితోనే స్థిరపడిపోతే ఈ చిన్న వర్గం మాత్రం ఎక్కువ మంది భాగస్వాములతో గడపడానికి ఆసక్తి చూపుతుంటుంది. వారు ఎంజాయికి అలవాటు పడతారు.