పదిలో రెండు ఆంధ్రప్రదేశ్ నగరాలే – దేశంలో రెండో స్థాయి నగరాల రైజింగ్

LinkedIn India's Top 10 Cities on Rise
  • విశాఖ, విజయవాడ నగరాలపై అట్రాక్షన్
  • లింక్డ్‌ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ నివేదిక వెల్లడి
  • తెలంగాణలో ఏ నగరానికీ దక్కని చోటు
  • మెట్రోలకు గుడ్‌బై… కొత్త ఉపాధి బాటలు
  • చిన్న ఊర్లలో ఉద్యోగాల జోరు

సహనం వందే, అమరావతి:

పెద్ద నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు భరించలేక యువత చిన్న ఊర్ల బాట పడుతోంది. మెట్రోలను వదిలి ఉద్యోగులు చిన్న నగరాల వైపు పరుగులు పెడుతున్నారు. లింక్డ్‌ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ నివేదిక ప్రకారం పది రెండో స్థాయి నగరాలు దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి.

రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ట్రెండ్
కార్పొరేట్ రంగంలో ఎదగాలంటే ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మహా నగరాలకు వెళ్లాల్సిందే అనే రోజులు పోయాయి. ఇప్పుడు సక్సెస్ లొకేషన్ మారుతోంది. కెరీర్ ఆశయాలతో పాటు జీవన ప్రమాణాలను బ్యాలెన్స్ చేసుకోవడంపై అందరూ దృష్టి పెడుతున్నారు. దీనివల్ల పెద్ద నగరాల నుంచి చిన్న నగరాలకు టాలెంట్ మళ్లుతున్న రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ట్రెండ్ కనిపిస్తోంది.

Vizag and Vijayawada Placed in Top 10 Cities on the Rise

విశాఖపట్నం డిజిటల్ ఎకానమీ
విశాఖపట్నం ఇప్పుడు డిజిటల్ ఎకానమీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల ఎంట్రీతో వైజాగ్ టెక్ టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ ఇక్కడి ప్రముఖ సంస్థలుగా ఉన్నాయి. విజయవాడతోపాటు గుజరాత్‌లోని సూరత్, వడోదర, రాజ్‌కోట్, పంజాబ్‌లోని లూథియానా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, జార్ఖండ్‌లోని రాంచీ, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. దారుణం ఏంటంటే తెలంగాణకు చెందిన రెండో స్థాయి పట్టణం ఏది కూడా ఈ జాబితాలో లేకపోవడం విచారకరం.

లూథియానా, సూరత్ విస్తరణ
లూథియానా సిటీ కేవలం టెక్స్‌టైల్స్‌కే పరిమితం కాకుండా తన ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తోంది. టాటా స్టీల్ రాక, హల్వారా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, మ్యారియట్ లాంటి ప్రముఖ హోటళ్ల ఎంట్రీతో ఈ నగరం దూసుకుపోతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వంటివి ఇక్కడ టాప్ ఎంప్లాయర్లుగా ఉన్నాయి. డైమండ్స్, టెక్స్‌టైల్స్‌కు పెట్టింది పేరైన సూరత్ ఇప్పుడు మల్టీసెక్టార్ గ్రోత్ సిటీగా మారుతోంది. కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్, భారీ ఎగుమతులు, వేలాది స్టార్టప్‌లతో సూరత్ ఒక అద్భుతమైన బిజినెస్ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఆర్సెలర్ మిట్టల్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

వడోదర… ప్రయాగ్‌రాజ్… రాజ్‌కోట్ హబ్స్
గుజరాత్ కల్చరల్ క్యాపిటల్ అయిన వడోదర ఇప్పుడు వ్యాపార పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముంబైలో ఉండాల్సిన అనేక కుటుంబ వ్యాపారాలు వడోదర వైపు చూస్తున్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్, అరవింద్ వంటి సంస్థలు ఇక్కడ అడుగుపెడుతున్నాయి. ఎంబిక్ ఫార్మాస్యూటికల్స్, ఎల్ అండ్ టీ సంస్థలు ఇక్కడ ప్రధానంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ నగరంలో మెట్రో నెట్‌వర్క్, గంగా ఎక్స్‌ప్రెస్‌వే, పెరుగుతున్న హోమ్‌స్టేలతో మతపరమైన పర్యాటకం ఉపాధి ఇంజిన్‌గా మారుతోంది. రాజ్‌కోట్‌లో 2 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలు, భారీ ఎగుమతులు ఉన్నాయి.

LinkedIn India's Top 10 Cities on the Rise

జబల్‌పూర్… రాంచీ… రాయ్‌పూర్ ట్రెండ్
జబల్‌పూర్ చారిత్రాత్మకంగా డిఫెన్స్ రంగానికి గుర్తింపు పొందినప్పటికీ, ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా టెక్, కమర్షియల్ టాలెంట్‌ను ఆకర్షిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఇక్కడ ప్రముఖంగా ఉన్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, జిందాల్ గ్రూప్, టాటా స్టీల్ వంటి సంస్థల రాకతో ఒక పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. ఐఐటీ ధన్‌బాద్, కాన్సంట్రిక్స్ ఇక్కడ టాప్ ఎంప్లాయర్లుగా ఉన్నాయి. రాయ్‌పూర్ సెంట్రల్ ఇండియాకు కొత్త ఏఐ, ఐటీ హబ్‌గా మారుతోంది. దేశంలోనే మొదటి ఏఐ డేటా సెంటర్ పార్క్, సెమీకండక్టర్ ప్లాంట్‌తో పాటు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *