Baba Ashok Karat

బాబా వేషం.. మహిళా శోకం – నాసిక్ బాబా అశోక్ ఖరాత్ అరాచకాలు

సహనం వందే, నాసిక్: మనుషుల నమ్మకం ఒక అగాధమైతే అందులో దొంగ బాబా విసిరే వల ఒక విషాదం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ దేవుడి పేరిట వేషగాళ్లు మాత్రం వేటగాళ్లలా తారసపడతారు. మూఢనమ్మకం కళ్లకు గంతలు కట్టినప్పుడు పవిత్రమైన మంత్రాల సాక్షిగా అపవిత్రమైన పాడు పనులు ఎలా జరుగుతాయో చెప్పే పచ్చి నిజమే ఈ కథనం. సూపర్ నేచురల్ శక్తుల మోసంతనకు అలౌకిక శక్తులు ఉన్నాయని అశోక్ ఖరాత్ ప్రచారం చేసుకున్నాడు….

Read More
Apple 50 Years

అందమైన రూపం… ‘టచ్’ చేస్తే స్వర్గం – యాపిల్ సంస్థకు ఏప్రిల్ 1తో 50 ఏళ్లు పూర్తి

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో ఒక్కోసారి మనం అన్నీ కోల్పోయామని అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే ఒక చిన్న ఆలోచన మన రాతను మారుస్తుంది. యాపిల్ సంస్థ 50 ఏళ్ల పండుగ చేసుకుంటున్న వేళ ఒకప్పుడు ఆ సంస్థ చనిపోవడానికి కేవలం 90 రోజుల దూరంలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం. స్టీవ్ జాబ్స్ అనే ఒక యోధుడు తిరిగి వచ్చి కేవలం ఒక తెల్ల కాగితం మీద గీసిన నాలుగు గీతలు ఒక…

Read More
Star Rating Mafia

స్టార్ రేటింగ్… భారీ చీటింగ్ – ఆన్‌లైన్ మార్కెట్లో నకిలీ రివ్యూల మాఫియా

సహనం వందే, హైదరాబాద్: ఆన్‌లైన్ మార్కెట్ ఇప్పుడు నమ్మకద్రోహానికి అడ్డాగా మారింది. మనం నమ్మి కొనే వస్తువు వెనుక ఉన్న 5 స్టార్ రేటింగ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ రాసిన స్క్రిప్ట్ కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని శాసిస్తున్న ఈ నకిలీ రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బ్రిటన్ తాజా విచారణ బయటపెట్టింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసం కూడా అంతే వేగంగా అప్డేట్ అవుతోంది. నమ్మకానికి పాతరబ్రిటన్ పోటీ, మార్కెట్ల అధికార…

Read More
Dhudandhar Vs Pakistan

ధురంధర్ వసూళ్లపై పాకిస్తాన్ లొల్లి – వెయ్యి కోట్లలో సగం వాటాకు ల్యారీ డిమాండ్

సహనం వందే, ముంబై: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాస్తున్న ధురంధర్ ది రివెంజ్ చిత్రం ఇప్పుడు ఒక అంతర్జాతీయ చర్చకు దారితీసింది. కరాచీలోని ల్యారీ మురికివాడ నేపథ్యంలో సాగే ఈ కథ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడంతో అక్కడి స్థానికులు వింత డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రాంతం పేరును, అక్కడి పరిస్థితులను వాడుకుని కోట్లు గడించిన నిర్మాతలు తిరిగి తమకు వాటా ఇవ్వాలని కోరడం ఇప్పుడు సరిహద్దుల మధ్య చర్చనీయాంశంగా…

Read More
South Vs North

అస్తిత్వ పోరాటపు అంచున దక్షిణాది – భారత్‌లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం ఒక విలక్షణమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకుపోతుంటే… ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా పట్టు బిగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు దేశ సమగ్రతకు సవాలుగా మారాయి. ఈ సున్నితమైన అంశంపై జాతీయ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూలో కాంగ్రెస్ నేత శశి ధరూర్ రాసిన కథనం సంచలనం సృష్టిస్తుంది. ఆ స్టోరీలోని కొన్ని కీలకమైన విషయాలు ఇక్కడ చూడవచ్చు….

Read More
Fruit Juice Sugar attacks

పండ్ల రసంతో పుండ్ల శరీరం – తెలియకుండానే షుగర్ ఎటాక్

సహనం వందే, హైదరాబాద్: ఉదయాన్నే ఒక గ్లాసు పండ్ల రసం తాగితే ఆరోగ్యం వస్తుందని నమ్ముతున్నారా? అయితే మీరు క్యాలరీల ఉచ్చులో చిక్కుకున్నట్లే. పండ్ల రసాలు, స్మూతీలు ఆరోగ్యకరమనే అపోహ మనల్ని ముంచుతోంది. ఇవి మన శరీరంలోకి నిశ్శబ్దంగా కొవ్వును చేరవేసే బాంబుల్లా పనిచేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ముసుగులో మనం తీసుకునే ఈ పానీయాలు మెటబాలిజంను దెబ్బతీస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. పండ్ల రసాల్లో చక్కెర ముప్పుపండ్లను నేరుగా తినకుండా రసాలుగా మార్చినప్పుడు అందులోని పీచు పదార్థం పూర్తిగా నశిస్తుంది….

Read More
Bengaluru Medical collage

ముసలోడికి దసరా పండుగ – బెంగళూరు మెడికల్ కాలేజ్ క్లాస్‌రూమ్ రచ్చ

సహనం వందే, బెంగళూరు: వయసు మళ్ళిన పురుషులు తమ కంటే చాలా చిన్న వయసున్న యువతుల వెంట పడటం వెనుక కేవలం ఆకర్షణే కాదు బలమైన సామాజిక, మానసిక కారణాలు ఉన్నాయి. బెంగళూరు ప్రొఫెసర్ ఉదంతం మొదలుకొని హాలీవుడ్ స్టార్ల వరకు అందరిదీ ఒకే బాట అని విశ్లేషణలు చెబుతున్నాయి. పురాణాలు, పరిణామ క్రమం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్లాస్‌రూమ్ ప్రపోజల్ రచ్చబెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో రెండు రోజుల క్రితం వింత…

Read More
Women Lawyers

మహిళా న్యాయ’బాధలు’ – పురుష అహంకారపు న్యాయ పీఠం

సహనం వందే, హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థలో మహిళా లాయర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చట్టం ముందు అందరూ సమానమని చెప్పే కోర్టు గదుల్లోనే లింగ వివక్ష రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సర్వేలో వెల్లడైన చేదు నిజాలు వ్యవస్థలోని కుళ్ళిన సంస్కృతిని బయటపెట్టాయి. 2,604 మంది మహిళా న్యాయవాదుల గొంతుకలు నేడు న్యాయం కోసం నిలదీస్తున్నాయి. నివేదికలోని ప్రతి అంకె ఒక కన్నీటి గాథను వినిపిస్తోంది. ఫీజుల చర్చల వద్ద అవమానంమహిళా లాయర్లు తమ ప్రతిభను…

Read More
Amazon Deliveries with in 45 Mins.,

అమెజాన్ ‘టైమ్’ సేల్ – వస్తు డెలివరీలో రోజుల నిరీక్షణకు చరమగీతం

సహనం వందే, హైదరాబాద్: అమెజాన్ ఇప్పుడు కేవలం వస్తువుల అమ్మకందారు మాత్రమే కాదు… సమయాన్ని అమ్ముతూ జేబులు గుల్ల చేసే వ్యాపారిగా మారుతోంది. వారం రోజుల వెయిటింగ్‌కు మంగళం పాడుతూ ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వస్తువును మీ గుమ్మం ముందుకు తెచ్చేలా స్కెచ్ వేసింది. ‘ఎవ్రీథింగ్ స్టోర్’ నుంచి ‘ఎవ్రీ అవర్ స్టోర్’గా మారి… రోజులో ప్రతి గంటను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా జేఫ్ బెజోస్ సామ్రాజ్యం కొత్త యుద్ధానికి తెరలేపింది. దీనికోసం ప్రత్యేక రుసుములు…

Read More
Air charges hike due to war

విమాన చార్జీల విస్ఫోటనం – గగన విహారం… టికెట్ల ధరల విన్యాసం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య ఆకాశ ప్రయాణం ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం… విమాన మార్గాల మార్పుతో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ సంక్షోభం కేవలం విదేశాలకు వెళ్లే వారికే కాకుండా భారతీయ పర్యాటక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్…

Read More