
అద్దె భార్య… అంతులేని వ్యధ – థాయ్‌లాండ్ పర్యాటకంపై విమర్శల వెల్లువ
సహనం వందే, బ్యాంకాక్:థాయ్‌లాండ్ పర్యాటకం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న ఒక చీకటి ధోరణి ప్రపంచ మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. పట్టాయా వంటి నగరాల్లో విదేశీ పర్యాటకులు తాత్కాలికంగా భార్యలను అద్దెకు తీసుకునే ఈ పోకడ ఆర్థిక అవసరాల పేరుతో మహిళలను వస్తువుల్లా మార్చే ప్రమాదకరమైన దోపిడీగా మారింది. రచయిత లావెర్ట్ ఎమ్మాన్యుయేల్ తన పుస్తకంలో బయటపెట్టిన ఈ అమానవీయ వాస్తవం ప్రపంచవ్యాప్తంగా సామాజిక నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది…