
ఎత్తుకు వైద్యం… వికటిస్తే వైకల్యం – ఫ్యాషన్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత
సహనం వందే, హైదరాబాద్:ఎత్తు పెరగాలనే కోరిక… దానికోసం ప్రాణాలను పణంగా పెట్టేంత పరిస్థితి దాపురించడం ఒక ఆందోళన కలిగించే అంశం. వ్యాయామం, సరైన ఆహారం, చిట్కాలు లాంటివి ఫలితం ఇవ్వనప్పుడు యువత ఫ్యాషన్ కోసం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఎత్తు పెంచే వైద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ ఆపరేషన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే దీనిలోని ప్రమాదాలను బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలోనూ…