
సూర్యాపేట శరత్ కార్డియాక్ సెంటర్లో తనిఖీలు
బయటపడ్డ అక్రమాలు… టీజీఎంసీ నోటీసులు సహనం వందే, సూర్యాపేట సూర్యాపేటలోని శరత్ కార్డియాక్ సెంటర్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కార్డియాక్ సెంటర్లో జరుగుతున్న పలుఅక్రమాలు బయటపడ్డాయి. తనిఖీల్లో డాక్టర్లు తమ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన గుండె డాక్టర్ లేకుండానే టెక్నీషియన్ స్కాన్ చేసి డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్నట్టు తేలింది. ప్రశాంత్ అనే పేషెంట్‌కు వనం శరత్ చంద్ర అనే…