
ఆయిల్ ఫెడ్ బోర్డుకు బురిడీ… కోట్లు దోపిడి
సహనం వందే, హైదరాబాద్: సురేందర్… గతంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా పనిచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు… ఫ్యాక్టరీల నిర్మాణం… ఉత్పత్తి వంటి విషయాలపై అంచనాలకు అందనంత దూరంలో లెక్కలు వేసి ఆయిల్ ఫెడ్ బోర్డును బోల్తా కొట్టించారన్న విమర్శలున్నాయి. అందుకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయి అండదండలు ఇచ్చారు. అందుకు 2023 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన బోర్డు సమావేశమే నిలువెత్తు నిదర్శనం….