
గురువుల పాఠమే ‘విజయ’ పీఠం – మాస్టార్లకు ఎంపీ అప్పలనాయుడు సన్మానం
సహనం వందే, రణస్థలం:విజయనగరం ఎంపీగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అప్పలనాయుడు తన గురువులను ఏమాత్రం మర్చిపోలేదు. రోజువారీ బిజీగా ఉన్నప్పటికీ తనకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టార్లను గౌరవించడం మానలేదు. గురువులు నేర్పిన పాఠమే తను ‘విజయ’నగరం ఎంపీ స్థాయికి ఎదగడానికి తోడ్పడిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురు పూజోత్సవం రోజున శుక్రవారం తనకు తొలి అక్షరాలు దిద్దిన గురువులను మర్చిపోని నిరాడంబరతను ప్రదర్శించారు. రణస్థలం మండలంలో ఉన్న తన ఆది గురువులు మేడూరి…