టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు
సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…