
డాక్టర్లా? బూచోళ్ళా? – ఆసుపత్రుల్లో శిశువులకు రక్షణ కరువు
సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు అసలు రక్షణ ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఎత్తుకొచ్చిన శిశువును కొనుగోలు చేసి… సరోగసి ద్వారా పుట్టించామని ఆ బిడ్డను తల్లిదండ్రులకు విక్రయించిన డాక్టర్ నమ్రత వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో శిశువులను ఎత్తుకుచ్చే గ్యాంగ్ తో ఫెర్టిలిటీ సెంటర్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది….