కళ్ళలో కుళ్ళు – స్మార్ట్ గ్లాసుల మాయ… ప్రైవసీ గోవిందా
సహనం వందే, లండన్: కళ్ళకు పెట్టుకునే అద్దాలే కీచక పర్వానికి తెరలేపుతున్నాయి. ఎదురుగా ఉన్న వ్యక్తికి తెలియకుండానే వారి ప్రతి కదలికను చిత్రీకరిస్తూ కొందరు వ్యక్తులు రాక్షసానందం పొందుతున్నారు. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై లైకుల కోసం మహిళల మర్యాదను బజారున పడేస్తున్నారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ అనాగరిక కృత్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అద్దాల్లో కెమెరాలులండన్ కు చెందిన దిలారా అనే యువతి తన భోజన సమయంలో అద్దాల వెనుక…