
‘కాంపౌండర్ల వైద్యంతో కాటికే’ – నకిలీ వైద్యులతో ప్రాణాలు హరి
సహనం వందే, రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా షాబాద్, హైతాబాద్ ప్రాంతాల్లో డాక్టర్లుగా చెలామణి అవుతున్న కాంపౌండర్లు, నకిలీ వైద్యుల గుట్టు రట్టైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం నిర్వహించిన తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ ఎయిడ్ బోర్డులు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి దవాఖానాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. కాంపౌండర్ గా పనిచేసి పెద్ద డాక్టర్లుగా చెప్పుకుంటున్నట్లు…