పాప కోసం ప్రధాని పంతం – అయినా లెక్క చేయని జర్మనీ దేశం
సహనం వందే, న్యూఢిల్లీ:బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం…