
‘ఆర్ఎస్ఎస్’ పై కేరళ టెక్కీ సూసైడ్ బాంబ్
సహనం వందే, న్యూఢిల్లీ:కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో…