బట్టలు మడత పెట్టడం ఎలా? – రోబోలకు పాఠాలు నేర్పుతున్న ఇంజనీర్లు
సహనం వందే, హైదరాబాద్: చాట్ జీపీటీతో ప్రపంచాన్ని ఊపేసిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు రోబోటిక్స్ రంగంలో సంచలనానికి సిద్ధమవుతోంది. మనం సినిమాల్లో చూసే రోబోలు ఇకపై నిజం కాబోతున్నాయి. సామ్ ఆల్ట్ మాన్ నేతృత్వంలోని బృందం శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక రహస్య ల్యాబ్ నడుపుతోంది. అక్కడ రోబోలకు ఇంటి పనులు నేర్పడమే ప్రధాన లక్ష్యంగా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. రోబోలకు ఇంటి పాఠాలు ఓపెన్ ఏఐ సంస్థ తన రోబోటిక్స్ విభాగాన్ని భారీగా విస్తరించింది. గతేడాది…