రోడ్లపై నరబలి – రహదారి ప్రమాదాల్లో సామూహిక ఊచకోత
సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ రోడ్లు మరణం మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కేవలం యాక్సిడెంట్లుగా పరిగణించలేం. ఇవి వేగంగా వాహనాలు నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్లక్ష్యపు హత్యలే. ప్రతిరోజూ సగటున 420 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రోడ్ల మీద చనిపోయారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు…