
ఓం బదులు ఇస్లామిక్ పదం బిస్మిల్లాతో రామాయణం
సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం…