
సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ఘటన
సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…