
బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…
సహనం వందే, హైదరాబాద్:బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి….